పదిహేడేళ్ళ తర్వాత తెరపై వారిద్దరి జోడి!

పదిహేడేళ్ళ తర్వాత తెరపై వారిద్దరి జోడి!

Published on Mar 10, 2015 9:14 PM IST

soggade_chinni_nayan-(1)
నాగార్జున – రమ్యకృష్ణ.. ఈ జోడీని తెరపై చూసి ఎన్ని సంవత్సరాలైందో తెల్సా ? దాదాపుగా పదిహేను సంవత్సరాల పైనే! వీరిద్దరూ తాజాగా ‘సోగ్గాడే చిన్ని నాయనా..’ సినిమా కోసం జత కట్టారు. 1998లో కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చంద్రలేఖ’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. మళ్ళీ ఈ జంట కలిసి పనిచేస్తుంది.. ఈ సినిమాకే! ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో! ఇదే విషయమై నాగార్జున ఒక ట్వీట్ చేశారు. రమ్యకృష్ణతో కలిసి మళ్ళీ ఇన్నేళ్ళకు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆ ట్వీట్‌లో.. “1500 ఏళ్ళ క్రితం నాటి పురాతన శివాలయంలో రమ్యకృష్ణతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నా.ఇప్పటికీ ఆమె అందం విషయంలో ఏమార్పూ లేదు” అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. అక్కడి షూటింగ్ ఫోటోలను ఈ ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో నాగార్జున-రమ్యకృష్ణల జోడీ ఆకట్టుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.

తాజా వార్తలు