జయలలితగా మారనున్న రమ్యకృష్ణ !

జయలలితగా మారనున్న రమ్యకృష్ణ !

Published on Dec 21, 2018 1:09 AM IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరియు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలితగారి జీవితం ఆధారంగా ఇప్పటికే భారతాయి రాజా, ఏఎల్ విజయ్, ప్రియదర్శిని ఇలా పలువురు దర్శకులు సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడ జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారట. కాకపోతే గౌతమ్ వాసుదేవ్ మీనన్ తియ్యబోయేది సినిమాగా కాదు.

వెబ్ సిరీస్ గా జయలలిత జీవితాన్ని 30 ఎపిసోడ్స్ ఉండేలా రూపొందించనున్నారు. అయితే జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. జయలలిత బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే రమ్యకృష్ణ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలు భావించారట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు