జయలలితగా రమ్యకృష్ణ 32 ఎపిసోడ్స్ !

జయలలితగా రమ్యకృష్ణ 32 ఎపిసోడ్స్ !

Published on Jan 4, 2019 12:50 AM IST

Ramya Krishna
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలితగారి జీవితం ఆధారంగా ఇప్పటికే ఏఎల్ విజయ్, ప్రియదర్శిని, భారతాయి రాజా ఇలా పలువురు దర్శకులు సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వారితో పాటు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా జయలలిత బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నానని ఇటీవలే ఆయన అధికారికంగా ప్రకటించారు.

కాగా వెబ్ సిరీస్ గా జయలలిత జీవితాన్ని 32 ఎపిసోడ్స్ ఉండేలా రూపొందించాలని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ ని కూడా ఆయన ఫైనల్ చేసారని తెలుస్తోంది. ఇక జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది.

జయలలితగారి లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే రమ్యకృష్ణ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలు భావించారట. అందుకే రమ్యకృష్ణను జయలలిత పాత్రలో నటింపజేస్తున్నారు.

తాజా వార్తలు