‘రమ్యకృష్ణ – శివాత్మిక’ కలయికలో ప్యాచ్ వర్క్ !

Published on Mar 21, 2021 11:44 pm IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. ఇప్పటికే ఈ సినిమా కీలకమైన షూటింగ్ పార్ట్ ను పూర్తీ చేసుకుంది. అయితే రేపటి నుండి ఈ సినిమాకి సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ ను షూట్ చేయబోతున్నారని.. రమ్యకృష్ణ – శివాత్మిక రాజశేఖర్ కలయికలో ఈ సీన్స్ ను తీయనున్నాడని సమాచారం.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే.

అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :