నటుడు రానా సినిమా సినిమాకు భిన్నత్వం చూపాలని అనుకుంటుంటారు. డిఫరెంట్ కథలు, పాత్రలను ఎంపిక చేసుకుంటుంటారు. అలా ఆయన చేసిన చిత్రమే ‘అరణ్య’. అడవులు, ఏనుగుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. మార్చి 26న విడుదలకానుంది. ప్రభు సోలమన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా తన కెరీర్లో చాలా ప్రత్యేకమైందంటున్నారు తన. షూటింగ్ సంయమో ఏనుగులతో ఏర్పడిన అనుబంధం తన జీవితాన్నే మార్చేసిందని అంటున్నారు. ఆ మార్పు తనను ఒక కొత్త మనిషిగా నిలబెట్టిందని చెబుతున్నారు.
చిత్రీకరణ కోసం ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకున్నానని చెప్పుకొచ్చిన రానా ఏనుగులు ఏదో ఒక రకంగా భూమికి పరోపకారం చేస్తుంటాయని మనుషుల్లో అదే లోపించిందని అనిపిస్తోందని, ఏనుగులు మమకారం పెంచుకుంటే చాలా ప్రేమగా చూసుకుంటాయని అన్నారు. షూటింగ్ స్పాట్లో పొరపాటున కిందపడిపోతే వెంటనే వచ్చి హత్తుకుంటాయని, ప్రేమగా చూసుకుంటాయని, హవభావాలు పలికించడంలో మనుషులైనా పొరపాట్లు చేస్తారేమో కానీ ఏనుగులు మాత్రం అస్సలు తప్పు చేయవని చెప్పుకొచ్చారు. ఏనుగులతో సాన్నిహిత్యం తాన్ జీవితంలో గొప్ప మార్పును తెచ్చిందని అన్నారు.
