ఒంటరి పోరాటానికి దిగిన బాబాయ్-అబ్బాయ్

Published on Feb 11, 2020 7:12 am IST

రానా దగ్గుబాటి నిన్న ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం హాథీ మేరే సాథీ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రం అరణ్య పేరుతో రానున్న నేపథ్యంలో తమిళంలో కూడా విడుదల కానుంది. ఇలా ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాషలలో ఏఫ్రిల్ 2న విడుదల చేస్తున్నారు. కాగా అరణ్య మూవీలో ఏనుగులను మచ్చిక చేసుకొని వాటితో సావాసం చేసే అడవి తెగకు చెందిన వ్యక్తిగా రానా లుక్ ఆశ్చర్యపరిచింది. ఆయన ఈ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో కంప్లీట్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. ఇక అడవి కోసం అందులోని ఏనుగుల మనుగడ కోసం స్వార్ధ పరులపై ఒంటరి పోరాటం చేసే యోధుడిగా రానా పాత్ర ఉండనుంది.

మరో వైపు రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ ఇలానే డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. తమిళ చిత్రం అసురన్ రీమేక్ గా వస్తున్న నారప్ప సినిమాలో ఆయన వయసుకొచ్చిన ఇద్దరు కొడుకులకు తండ్రిగా నటిస్తున్నారు. అగ్రకులాలకు చెందిన వారు అణగారిన సామాజిక వర్గాలపై ఆధిపత్యాన్ని, వారి దుర్మార్గాలను ఎదిరించి పోరాడే వాడిగా వెంకటేష్ పాత్ర ఉంటుంది. ఇలా బాబాయ్ అబ్బాయిలు తమ తదుపరి సినిమాలలో ఒంటరి పోరాటాలకు సిద్ధమయ్యారు. నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండగా, అరణ్య మూవీ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతుంది.

సంబంధిత సమాచారం :