స్పెషల్ డే నాడు రానాకు భార్య మిహికా లవ్లీ విషెష్!

స్పెషల్ డే నాడు రానాకు భార్య మిహికా లవ్లీ విషెష్!

Published on Feb 20, 2021 10:56 PM IST


రానా దగ్గుబాటి వెండితెరకు పరిచయమై 11ఏళ్ళు అయ్యింది. ఆయన మొదటి చిత్రం లీడర్ 2010లో విడుదల కావడం జరిగింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాలో రానా యువ ముఖ్యమంత్రి పాత్ర చేశారు. ఈ పదకొండేళ్లలో రానా అనేక మైలు రాళ్లను అందుకున్నారు. బహుబలి లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ మూవీలో నటించిన రానా… పలు భాషల్లో నటించి పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

రానా పదకొండేళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా సురేష్ ప్రొడక్షన్స్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేయడం జరిగింది. అలాగే ఫ్యాన్స్, పరిశ్రమ ప్రముఖులు మరియు కుటుంబ సభ్యులు రానాకు విషెష్ తెలియజేశారు. కాగా రానా వైఫ్ మిహికా బజాజ్ సైతం ఆయనకు విషెష్ తెలియజేశారు. హ్యాపీ 11 ఇయర్స్ డార్లింగ్.. అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టడం జరిగింది.

ఇక రానా నటించిన పాన్ ఇండియా చిత్రం అరణ్య విడుదల కావాల్సి ఉంది. అలాగే ఆయన తెలుగులో విరాటపర్వం అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వేణు ఉడుగుల కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా విరాటపర్వం తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు