క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తండ్రి విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ పేరుతొ బయోపిక్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈచిత్రంలో రానా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు.
ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో అయన కనిపించనున్నారు . ఇందుకోసం రానా తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్ లో ఆయన మీద కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మరి చంద్రబాబు పాత్రలో ఆయన ఎలా నటిస్తారో చూడాలి. ఇక కైకాల సత్యనారాయణ , ప్రకాష్ రాజ్, విద్యాబాలన్, వంటి భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈచిత్రం యొక్క విడుదల హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.


