రానా తండ్రి కాబోతున్నాడన్న వార్తలపై క్లారిటీ..!

Published on Apr 1, 2022 12:18 am IST

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో రానా ద‌గ్గుబాటి-మిహికా బ‌జాజ్ జంట ఒక‌టి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా గతేడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో మిహికాను వివాహమాడి ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో రానా-మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఈ ఫోటోల్లో మిహికా కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో మీరు తల్లి కాబోతున్నారా అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి సమాధానంగా మిహికా అలాంటిదేమి లేదు.. ఇది పెళ్లి తరువాత వచ్చే మార్పు మాత్రమే అని బదులిచ్చింది. దీంతో రానా తండ్రి కాబోతున్నాడన్న వార్తలకు ఇప్పటికైతే ఫుల్‌స్టాఫ్ పడినట్టు అయ్యింది. మరి త్వరలోనే ఈ జంట ఏదైనా శుభవార్తను చెప్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :