విరామంలో ‘విరాట పర్వం` !

Published on Sep 19, 2019 1:04 am IST

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాట పర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది.

అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయాలనుకున్నా.. ప్రస్తుతం రానా అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట. రానా ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాలు తరువాత రానా వస్తాడట. రానా వచ్చాక సాయి పల్లవితో రానా కాంబినేషన్ లో ఉన్న సీన్లను షూట్ చేయనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More