అచ్చం చంద్ర‌బాబు నాయుడిగారిలానే కనిపిస్తా – రానా

Published on Aug 26, 2018 9:37 am IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో శరవేగంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’లో చంద్ర‌బాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1నుండి మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోబోతున్న ఈ చిత్రం పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవలే విడుదల అయిన ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య లుక్ కి విపరీతమైన స్పందన వచ్చింది. బాలయ్య అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నారని కామెంట్స్ వినిపించాయి. అలాగే రానా లుక్ కూడా అచ్చం చంద్రబాబును పోలి ఉంటుందట. ఈ విషయం స్వయంగా రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘ఎన్టీఆర్ బయోపిక్’ కోసమే బరువు తగ్గానని, నా గెటప్ చంద్రబాబుగారిని గుర్తుకుతెస్తుందని,ఇప్పటికే నా పై కొంతభాగం చిత్రీకరణ జరిపారని త్వరలోనే నా పార్ట్ పూర్తవుతుందని రానా తెలిపారు. కాగా ఈ చిత్రానికి ప్రత్యేకంగా బాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. ఆ కారణంగానే గెటప్స్ అన్ని చాలా సహజంగా వస్తున్నాయి. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More