‘బాహుబలి – రుద్రమదేవి’ కోసం రానా చేసిన వర్కౌట్స్.!

‘బాహుబలి – రుద్రమదేవి’ కోసం రానా చేసిన వర్కౌట్స్.!

Published on Sep 4, 2014 8:46 AM IST

rana

యంగ్ హీరో రానా ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న రెండు ప్రతిష్టాత్మక మరియు అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అవే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ మరియు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’. ఇప్పటికే రానా ‘రుద్రమదేవి’కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేయగా ‘బాహుబలి’ మాత్రం సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాలు ఒకే టైంలో సెట్స్ పై ఉండడంతో రానా కూడా రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్ కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది.

ఈ విషయం గురించి రానా మాట్లాడుతూ ‘ మొదట బాహుబలి షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ సినిమాల్లో నా లుక్ ప్రకారం భారీగా కండలు తిరిగిన బాడీతో కనపడాలి. అందుకే బాగా వర్కౌట్స్ చేసి 112కేజీలు పెరిగాను. రుద్రమదేవి విషయానికి వచ్చే సరికి కాస్త సన్నగా కనపడాలి. అందుకే ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే టైం కి మళ్ళీ ఫిట్ నెస్ పై వర్కౌట్ చేసి వెయిట్ తగ్గించి 102 కేజీలకు వచ్చేవాడినని’ అన్నాడు. ఇలా ఏక కాలంలో సినిమా షూటింగ్ మారితే చాలు రానా వెయిట్ పెంచుతూ, తగ్గిస్తూ బాగా కష్టపడ్డాడు.

రానా ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కాకుండా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో పాటు కలిసి ‘బేబీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కూడా రానా కాస్త సన్నగా ఉండాలి. అందుకే ప్రస్తుతం రానా బాలీవుడ్ సినిమా కోసం తన బాడీని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు