అజిత్‌తో కలిసి రానా మరో సినిమా?

అజిత్‌తో కలిసి రానా మరో సినిమా?

Published on Nov 3, 2015 8:22 PM IST

rana-ajith
‘బాహుబలి’లో భల్లాల దేవగా కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన హీరో రానా.. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సరికొత్త స్టార్‌గా అవతరించారు. ఇక ఇంతకుముందే తమిళ, హిందీల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన రానాకు, బాహుబలి తర్వాత ఆయా ఇండస్ట్రీల నుంచి క్రేజీ ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి. తాజాగా అదే కోవలో దర్శకుడు విష్ణు వర్ధన్ తన తదుపరి సినిమాలో ఓ ప్రధాన పాత్రకు రానాను సంప్రదించారని తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఓ చారిత్రక కథతో రూపొందనుందని సమాచారం. గతంలో తెలుగులో ‘పంజా’, తమిళంలో ‘ఆరంభం’ లాంటి క్లాస్ స్టైలిష్ యాక్షన్ సినిమాలను అందించిన విష్ణు వర్ధన్ ఈ చారిత్రక కథకు సంబంధించి ప్రస్తుతం పరిశోధన నిర్వహిస్తున్నారు. పకడ్బందీగా స్క్రిప్ట్ పూర్తి చేసి సినిమాను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక గతంలో సూపర్ హిట్ ‘ఆరంభం’ సినిమాలో అజిత్‌తో కలిసి నటించిన రానా, మళ్ళీ అజిత్‌తో కలిసి నటించే అవకాశం కనిపిస్తూ ఉండడం విశేషంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత నిర్మాత ఏ.ఎమ్.రత్నం ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు