ఎన్టీఆర్ హౌస్ లో రానా !

ఎన్టీఆర్ హౌస్ లో రానా !

Published on Aug 17, 2018 4:31 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా సోమవారం నుండి ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ను చిత్రబృందం తెరకెక్కిస్తున్నారు.

కాగా, సీనియర్ ఎన్టీఆర్ గారు మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చాక హబిడ్స్ ప్రాంతంలో ఓ ఇల్లును కొనుక్కొని దానిలోనే చాలా సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇంటిలోనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాలు రానా, బాలయ్య మీద చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. రానా చంద్రబాబు నాయుడు పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు