అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘పటాస్’. యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈచిత్రం 2015లో విడుదలై కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కథను ముందు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కు వినిపించారట అనిల్. సురేష్ బాబు కథలో కొన్ని మార్పులు చేసి రానా ను హీరోగా పెట్టి ఈసినిమా నిర్మించాలని అనుకున్నాడట. కానీ రానా అప్పటికే బాహుబలి చిత్రంలో నటిస్తుండడం అది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుండడంతో అనిల్ ఈచిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్స్ లోఆయన తోనే తెరకెక్కించాడు. అలా ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని సురేష్ బాబు అన్నారు.
ఇక సురేష్ బాబు కేరాఫ్ కంచరపాలెం అనే చిత్రాన్ని విడుదల చేస్తున్నారని తెలిసిందే. ఈచిత్రం ఈనెల 7న విడుదలవుతున్న సంధర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో ఆయన ఈ వాక్యాలు చేశారు.
