వాస్తవ ఘటనల ఆధారంగా రానా సినిమా !
Published on Jun 23, 2018 10:58 pm IST


రెగ్యులర్ కథల్ని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త తరహా కథల్ని మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న రానా ప్రస్తుతం ‘హాతి మేరే సాతి’ అనే సినిమా చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘అరణ్య’ పేరుతో రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు ప్రభు సాలమన్.

కొన్నేళ్ల క్రితం అస్సాంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉండనుంది. ఇందులో మనుషులు, జంతువులకు మధ్యన జరిగిన పోరాటాన్ని ఎలివేట్ చేయనున్నారు. అస్సాంలోని కజరంగా ప్రాంతంలో మానవ చర్యల మూలాన సుమారు 20 ఏనుగులు ఆశ్రయాన్ని కోల్పోవడం, అవి మళ్ళీ ఎలా కాపాడబడ్డాయి అనేది ఈ సినిమా ప్రధానాంశంగా ఉండనుంది.

హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లోనూ విడుదలకానున్న ఈ చిత్రంలో కల్కి కొచ్లిన్, పుల్కిత్ సామ్రాట్, హుస్సేన్, జోయా వంటి నటీనటులు నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook