సుధీర్ బాబు సినిమాలో రానా, చైతుల గెస్ట్ రోల్

సుధీర్ బాబు సినిమాలో రానా, చైతుల గెస్ట్ రోల్

Published on Jan 16, 2015 1:45 AM IST

rana_nagachaitany33
ప్రేమకధా చిత్రమ్ సినిమా ద్వారా హిట్ లీగ్ లోకి అడుగుపెట్టిన సుధీర్ బాబ్ మరోసారి నందితతో జతకట్టి ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు. కన్నడలో విజయం సాధించిన ‘చార్మినార్’ సినిమాకు ఇది రిమేక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు యువహీరోలు తళుక్కున మెరవనున్నారు.

ఈ సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ కధానుసారం సినిమాలో రెండు ముఖ్యపాత్రల ప్రవేశం అవసరం.దీనికోసం దగ్గుబాటి రానా, నాగచైతన్యలను ఎంపిక చేసుకోవడం, వారు నటించడానికి ఆమోదం తెలిపడం ఆనందకరమని తెలిపారు. గతంలో ఈ బ్యానర్ నుండి వచ్చిన స్టైల్ సినిమాలో లారెన్స్ కోసం నాగార్జున, చిరంజీవి తళుక్కున మెరిసిన సంగతి తెలిసినదే

తాజా వార్తలు