
టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ కారణంగా రానా మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. రానా ఫాదర్, టాప్ ప్రొడ్యూసర్ అయిన డి. సురేష్ బాబు ప్రస్తుతం రానా కోసం కథలను ఓకే చేస్తున్నారు. ఇప్పటికే మూడు కథలను ఓకే చేసారు. అందులో ఓ సినిమాకి ‘కవచం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.
తాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు మాట్లాడుతూ ‘రానాతో మొదటి సినిమా నేను చెయ్యాలి కానీ కుదరలేదు. ఆ తర్వాత పలు కారణాల వల్ల మా బ్యానర్ లో సినిమా చేయలేకపోయాం. ఇప్పుడేమో బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బాహుబలి పార్ట్ 1 పూర్తయ్యి సెకండ్ పార్ట్ మొదలు పెట్టే గ్యాప్ లో రానాతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘కవచం’ సినిమాని, పరశురాం డైరెక్షన్ లో ‘చుట్టాలబ్బాయి’ సినిమాలను ఖరారు చేసాం. కానీ వీటిలో ముందు ఏది తీస్తాం అనేది త్వరలో చెబుతాం’ అని సురేష్ బాబు అన్నాడు.
ఇదికాకుండా డి. సురేష్ బాబు నిర్మాతగా విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన ‘దృశ్యం’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.