రానా ఆరోగ్యం బాగానే ఉంది !
Published on Jun 19, 2018 8:26 am IST

నటుడు రానా త్వరలో కంటి చికిత్స కోసం యూఎస్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. బ్లడ్ ప్రెషర్ సమస్య వలన ఈ సర్జరీ కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారని, సింగపూర్ డాక్టర్ల వద్ద చికిత్స తీసుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. వీటిపై స్పందించిన రానా వాటిలో నిజం లేదని ఖండించారు.

తనకు బ్లడ్ ప్రెషర్ సమస్య ఉందని, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుండటం వలన కంటి సర్జరీ కూడ ఆలస్యమైందని, అంతేగాని అంతకు మించి తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అన్నారు. ప్రస్తుతం అయన నటిస్తున్న ‘హాతి మేరే సాతి’ నెక్స్ట్ షెడ్యూల్ కూడ రానా కంటి చికిత్స చేయించుకుని కోలుకున్న తరవాతే ఉంటుందట.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook