‘దగ్గుబాటి రానా’ ‘సీఎం చంద్రబాబు’గా మారబోతున్నాడా ?
Published on Jun 14, 2018 12:30 am IST


క్రిష్ దర్శకత్వంలో బాలయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్. ఎన్నో ప్రముఖమైన పాత్రలు ఈ బయోపిక్ లో ఉన్నాయి. దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఆ పాత్రల కోసం నటులను అన్వేశించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను ప్రముఖ హిందీ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు. బయోపిక్ లో మరో అతి ముఖ్యమైన పాత్ర నాదండ్ల భాస్కరరావు పాత్ర. ఈ పాత్రను ప్రముఖ నటుడు బోమన్ ఇరానీని తీసుకోనున్నారు. ఎన్టీఆర్ గారి జీవితం గురించి ప్రస్తావిస్తే ఖచ్చితంగా చెప్పుకున్నే మరో పాత్ర ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారిది.

చంద్రబాబుగారి పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నారని తెలుస్తోంది. జులై చివర్లో బయోపిక్ షూట్ మొదలుకానుంది. విద్యాబాలన్, బాలకృష్ణ మీద మొదటి షెడ్యూల్ షూట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ గారు బసవతారకంగారి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే దృశ్యాలను మొదటి షెడ్యూల్ లో తెరెకెక్కించనున్నారు.

 
Like us on Facebook