పవన్‌కు రానా ఏమాత్రం తీసిపోరట

Published on Feb 23, 2021 10:09 pm IST


తెలుగు సినిమాల్లో ఒకప్పుడు హీరో పాత్రే అన్ని పాత్రలకు మించి ఉండాలనే నియమం ఒకటి ఉండేది. ఏం చేసినా హీరోదే పైచేయి అన్నట్టు ఉండాలి కథ అనేవారు. కానీ రోజులు మారాయి. ప్రేక్షకులు సినిమాను చూసే కోణం మారింది. హీరోతో పాటు మిగతా పాత్రలకు కూడ కథలో ప్రాముఖ్యత ఉండాల్సిందే. అందునా ప్రతినాయకుడి పాత్ర హీరోకు సమానంగా ఉండాలి. విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. అందుకే పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్లో రానా పాత్రను పవన్ పాత్రతో సమానంగా ఎలివేట్ చేస్తున్నారట.

ఇందుకోసం ఒరిజినల్ వెర్షన్లో లేని కొత్త సన్నివేశాలను తెలుగులో రాసుకున్నారట. ఒకరకంగా చెప్పాలంటే పవన్ పాత్రతో సమానంగా రానా క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More