“అరణ్య” కోసం 15 రోజులు ముందే వాటితో జీవించా – రానా

Published on Mar 24, 2021 9:00 am IST

మన ఇండియన్ సినిమా దగ్గర చాలా కాలం అనంతరం వస్తున్న యానిమల్ కాన్సెప్ట్ ఎమోషనల్ డ్రామా “అరణ్య”. మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి డిఫరెంట్ రోల్ లో నటించిన ఈ చిత్రం రేపు 26న విడుదలకు ఉంది. మరి ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా పలు ఆసక్తికర విషయాలను ఈ సినిమాపై పంచుకున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఏనుగుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినది అని తెలిసిందే..

అయితే వాటితో నటించడం కంటే ముందు జీవించడానికి ముందే వెళ్లానని రానా తెలిపాడు. షూట్ ఇంకా స్టార్ట్ కాకముందే 15 రోజుల ముందుగా థాయిలాండ్ వెళ్లి అక్కడి ఏనుగులతో కలిసి ఉండడం మొదలు పెట్టానని ప్రతీ ఒక్కరోజు కూడా కొత్త విషయాన్ని నేర్చుకున్నానని మొదట నాలుగైదు రోజులు కాస్త భయం అనిపించినా తర్వాత మెల్లగా అలవాటు చేసుకున్నానని ఇలా “అరణ్య” గా మారినట్టు రానా తెలిపారు.

సంబంధిత సమాచారం :