మా బంధం అధికారికం అంటున్న రానా

Published on May 21, 2020 1:01 pm IST

రానా దగ్గుబాటి మిహికాతో పెళ్లి బంధం వైపుగా మరో అడుగు ముందుకేశారు. ఆయన తన ప్రేయసి మిహికాతో జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే ఇకపై మా బంధం అధికారికం అని ఓ కామెంట్ కూడా పెట్టారు. నిన్న కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా మిహికాతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక వీరి వివాహం ఈ ఏడాది చివర్లో ఉంటుందని సమాచారం.

రానా తండ్రి గారైన సురేష్ బాబు కొద్దిరోజుల క్రితం రానా-మిహికాల వివాహం డిసెంబర్ లోపే ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి 2020లోనే రానా బాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడు. ఇక ప్రస్తుతం రానా తెలుగులో విరాటపర్వం అనే మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

X
More