‘రుద్రమదేవి’ డబ్బింగ్ లో రానా

‘రుద్రమదేవి’ డబ్బింగ్ లో రానా

Published on May 5, 2015 11:21 AM IST

rana
టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుల్లో ఒకడైన రానా దగ్గుబాటి చేసిన రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘రుద్రమదేవి’ ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్ అనుష్క చేస్తుంటే అనుష్కకి జోడీగా చాళుక్య వీరభద్రుడి పాత్రలో రానా కనిపించనున్నాడు. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తను చేసిన గోన గన్నా రెడ్డి పాత్రకి డబ్బింగ్ ఫినిష్ చేసాడు, అలాగే అనుష్క పాత్రకి డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌమ్య కూడా డబ్బింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు రానా తన పార్ట్ కి డబ్బింగ్ చెబుతున్నాడు.

ఇప్పటికే చాలా వరకూ పూర్తి చేసిన రానా మరి కొద్ది రోజుల్లో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ కూడా పూర్తి చేయనున్నాడు. ప్రకాష్ రాజ్ పార్ట్ కూడా త్వరలోనే తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ఫినిష్ చేయనున్నాడు. ఓరుగల్లు ఘనతను చాటిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ ఈ చారిత్రాత్మక కథని సినిమాగా చేస్తున్నాడు.

ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 22న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు