భారదేశం గర్వించదగ్గ సినిమాగా వచ్చి, ప్రేక్షకులను మెప్పించి కలెక్షన్స్ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించిన రానా దగ్గుబాటికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇంత పెద్ద విజయం అందుకున్న తర్వాత కాస్త గప్ తీసుకున్న రానా తమిళంలో తెరకెక్కుతున్న ‘బెంగుళూరు డేస్’ రీమేక్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ సినిమాని పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండా రానా పివిపి బ్యానర్ లో ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అది కూడా టాలీవుడ్ లో ఇది వరకూ రాని నేవీ, సబ్ మెరైన్ కాన్సెప్ట్ మీద సినిమా చేయనున్నారు. మాకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం రానా ఈ సినిమాలో నావికా అధికారిగా కనిపించనున్నాడు. 1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నం లోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసారు. ఈ వీడని మిస్టరీ కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. సంకల్ప్ అనే కొత్త రైటర్ దర్శకుడుగా పరిచయం అవనున్న ఈ సినిమాని బ్లూ ఫిష్ అనే బుక్ ఆధారంగా చేసుకొని తీస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక అనౌన్స్ మెంట్ చేయనున్నారు.


