
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి సినిమా తనకు దొరికిన ఏ చిన్న ప్రచార మాధ్యమాన్ని వదులుకొనేందుకు సిద్ధంగాలేదు. ఇండియన్ హిస్టరీకే ఒక క్లాసిక్ అందించాలన్న తపనతో చిత్ర బృందం తపిస్తుంది. ఈ సినిమాకు చెందిన పబ్లిక్ రిలేషన్ల బృందం కూడా బాగానే కష్టపడుతుంది. హైదరాబాద్ కామికాన్ లో ప్రేక్షకులను అలరించిన తరువాత ఈ చిత్ర బృందం ఇప్పుడు ముంబై కామికాన్ పై దృష్టిపెట్టింది.
ఈ సినిమాకు చెందినా వస్తువులు, ఆయుధాలను ప్రదర్శించడమే కాక రేపు తొలిసారిగా ఈ ఈవెంట్ కి రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు