“గోరే గావ్” కోసం అడవిమనిషిలా కనిపించనున్న రానా…

Published on May 15, 2019 2:00 am IST

సినీ పరిశ్రమకి వచ్చిన ఆనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి… గత ఏడాది విడుదలైన బాహుబలి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరుని తెచ్చుకున్నారు రానా… కాగా రానా కి సంబందించిన ఒక కొత్త ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదివరకు ఎన్నడూ కనిపించని ఒక కొత్త గెటప్ లో రానా ఫోటో ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని లుక్ లో, మాసిపోయిన గడ్డంతో, చాలా వయసున్న వ్యక్తిలాగా, చూడగానే అడవి మనిషిలా కనిపిస్తున్నాడు రానా…

ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ ల కనిపించిన రానా చాలా నీట్ గా, క్లీన్ షేవ్ తో కనిపించాడు. అయితే ఒక్కసారి రానా కొత్త లుక్ బయటికి రావడంతో అందరు కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు. కాగా రానా ప్రస్తుతానికి నటిస్తున్నటువంటి “గోరే గావ్” చిత్రంలో ఒక అడవి మనిషిలాగ కనిపించనున్నాడని, ఆ చిత్రానికి సంబందించిన లుక్ తో ఇలా కనిపించాడని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More