సెలబ్రిటీలను జర్నలిస్ట్ లు ఇంటర్వ్యూ చెయ్యడం సర్వసాధారణం. కానీ సెలబ్రిటీలను సెలబ్రిటీలే ఇంటర్వ్యూ చేస్తే అది కాస్త విభిన్నం. ప్రస్తుతం అటువంటి ఒక సంఘటనే టాలీవుడ్ లో జరిగింది. రానా తాన బాబాయ్ వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేసాడు
దృశ్యం సినిమా ప్రచారంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సన్నివేశాలని ఇటీవలే ఒక ప్రాముఖ ఛానల్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం స్వయంగా రానానే తెలిపాడు
ఈ ఇంటర్వ్యూ వలన సినిమా ప్రేక్షకులకు మరింత చేరువవుతుందని చిత్ర బృందం భావిస్తున్నారు. ఇప్పటికే దృశ్యం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ బాబాయ్, అబ్బాయ్ ల ఇంటర్వ్యూకి మీరు సిద్ధమేనా?


