తన హిట్ సినిమాను తలపించిన రానా.!

Published on May 21, 2020 8:07 pm IST

మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో దగ్గుబాటి రానా కూడా ఒకరు. కానీ ఎట్టకేలకు తన జీవిత భాగస్వామిని అందరికీ పరిచయం చేసి ఒక తీపి కబురును అందరికీ అందించి సంతోషపరిచాడు. దీనితో రానా మరియు మిహికాల జంటకు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి శుభాశీస్సులు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా తాను మిషికా ప్రేమలో ఉన్నామని రానా చెప్పిన కొన్ని రోజులకే ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్ధం కూడా నిన్ననే జరుపుకున్నారు.

ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఏ ఫోటోలను చూసినట్లయితే రానా రీసెంట్ హిట్ దర్శకుడు తేజతో తీసిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాల్ని స్టిల్స్ గుర్తుకు రాక మానవు. ఆ సినిమాలో ఉన్నట్టుగానే పంచె కట్టుతో మిషికతో కలిపి తీసుకున్న ఫోటోలు ఆ సినిమాలో రాధా జోగేంద్ర పాత్రలను గుర్తు తీసుకురాక మానవు. ఈ విధంగా యాక్సిడెంటల్ గా ఆ సినిమాను రానా తలపించాడు.

సంబంధిత సమాచారం :

X
More