రానాకు ఆ చిత్రం బాగా నచ్చిందట !
Published on Aug 11, 2018 3:53 pm IST

నూతన నటీనటులతో నూతన దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’.వైజాగ్ దగ్గరలో ఉన్న కంచరపాలెం అనే గ్రామంలో జరిగే భిన్నమైన ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతుంది.యువ హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని చూసి ఆయనకు బాగా నచ్చడంతో ఈసినిమాను ఆయనే విడుదల చేయడానికి ముందుకొచ్చాడు.

దగ్గుబాటి సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల చేయనుంది.స్వీకర్ అగస్థీ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఆగస్టు 15న విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook