ఈ దసరా బరిలో రాబోతున్న సినిమా ‘రణబాలి’. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటిస్తున్న మొదటి సినిమా. అందుకే, సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఐతే, ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రష్మిక హాజరుకాకపోవడంతో ఆమె ఎందుకు రాలేదన్న చర్చ మొదలైంది. అయితే, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారని విజయ్ స్పష్టం చేశారు. కానీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక ఖచ్చితంగా పాల్గొననున్నారు.
రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ కార్యక్రమానికి విజయ్ మరియు చిత్ర బృందంతో కలిసి రష్మిక హాజరుకానున్నారు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు జరగనున్న ఈ ఈవెంట్, చిత్రానికి మంచి బజ్ ను క్రియేట్ చేస్తోందని చిత్ర బృందం ఆశిస్తోంది. అన్నట్టు అటు ‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న రెండో చిత్రం ఇదే కావడం కూడా ఈ సినిమాకి ప్లస్ కానుంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందించారు.


