వచ్చే వారం టీజర్ తో ‘రణరంగం’ !

Published on Jun 16, 2019 2:51 pm IST

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్ లో దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం లో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’గా కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా విడుదల తేదీ కూడా దగ్గరపడుతుండటంతో.. చిత్రబృందం కూడా ప్రమోషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టీజర్ రెడీ అయినట్లు వచ్చే వారంలో ‘రణరంగం’తో టీజర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందట. అలాగే ఎమోషన్స్ తో కూడినదై ఉంటుందని శర్వానంద్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. కాగా ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.

మొత్తానికి భిన్నమైన భావోద్వేగాలు, కధ కధనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తాయన్నమాట. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

సంబంధిత సమాచారం :

X
More