అనుకున్నట్టే వాయిదాపడిన ‘రణరంగం’

అనుకున్నట్టే వాయిదాపడిన ‘రణరంగం’

Published on Jul 16, 2019 6:48 PM IST

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘రణరంగం’. టీజర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను మొదట ఆగష్టు 2వ తేదీన విడుదలచేయాలని అనుకున్నారు నిర్మాతలు. ఆ తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ తేదీ దగ్గరపడుతున్నా చిత్ర ప్రమోషన్లు స్టార్ట్ కాలేదు. దీంతో సినిమా వాయిదాపడిందనే వార్తలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఈ వార్తే నిజమని తేలింది. చిత్రాన్ని ఆగష్టు 2 నుండి ఆగష్టు 15కి వాయిదావేసినట్టు దర్శకుడు సుధీర్ వర్మ ప్రకటించారు. అయితే ఈ వాయిదావేనకున్న అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు