టాలీవుడ్ అంతా గర్వించదగ్గే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎస్ ఎస్ రాజమౌళి, అతని టీం అంతా కలిసి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్ర టీం ఈ టీంలో పనిచేసే ప్రతి ఒక్కరి బర్త్ డేకి ఒక వీడియో లేదా ఫోటోని రిలీజ్ చేసి వారిని, వారితో పాటు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు రానా తన 30వ ఏట అడుగుపెట్టాడు. రానా పుట్టిన రోజు వేడుక కానుకగా బాహుబలి టీం రానా పోషిస్తున్న భల్లాల దేవకి సంబందించిన ఫస్ట్ లుక్ ఫోటోని రిలీజ్ చేసారు.
ఈ ఫోటో ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రానా యుద్ద భూమిలో తన రధంపై వచ్చే ఆ ఫోటో అదిరిపోయిందని ప్రతి ఒక్కరూ రానా, రాజమౌళిలపై ప్రశంశలు కురిపిస్తున్నారు. రానా ప్రస్తుతం బాహుబలి లోనే కాకుండా మరో పీరియాడిక్ ఫిల్మ్ అయిన రుద్రమదేవిలో కూడా నటించాడు. ఈ సినిమాలో రానా చేస్తున్న చాళుక్య వీరభద్రుడి లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కాకుండా రానా దగ్గుబాటి బాలీవుడ్ లో చేసిన బేబీ కూడా జనవరిలో రిలీజ్ కానుంది.


