రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే 90% చిత్రకరణ పూర్తయింది. కాగా ఈ రోజు రానా జన్మదినోత్సవం సందర్భంగా `విరాట పర్వం` ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. ఈ పోస్టర్ లో రానా కామ్రేడ్ రవి అన్నగా ఏకే 47 పట్టుకుని గంభీరంగా కనిపిస్తోన్న రానా లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో రానా పాత్ర తర్వాత కథలో ఉన్న శక్తిమంతమైన పాత్రలన్నీ మహిళలవేనట. సాయిపల్లవి, నందితాదాస్, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీరావు ఆ పాత్రలకు మరింత జీవ శక్తినిచ్చారని, ఒక రకంగా చెప్పాలంటే ‘విరాటపర్వం’ ఉమెన్‌హుడ్ కి ఒక నివాళి అని ‘వేణు ఉడుగుల’ ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కాగా 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో రానా నక్షలైట్ నటిస్తుండగా.. సాయి పల్లవి జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఆ రోజుల్లో తెలుగు రాష్టాల్లో చోటు చేసుకున్న కొన్ని కీలక అంశాల గురించి ఈ సినిమాలో ఉంటాయట. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.


