రానా లుక్ మాత్రం హైలెట్ అంటున్నారు

రానా లుక్ మాత్రం హైలెట్ అంటున్నారు

Published on Mar 9, 2021 9:05 PM IST

Rana Daggubati

మ్యాచో మ్యాన్ రానా ‘బాహుబలి’ తర్వాత చేస్తున్న పెద్ద మల్టీస్టారర్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్. పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన పాత్ర చేస్తుండగా రెండో కీలకమైన పాత్రను రానా చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో పవన్ కళ్యాణే ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ రానా పాత్ర తక్కువేమీ కాదు. కథ పరంగా పవన్ పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో రానా పాత్రకూ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మలయాళ వెర్షన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఫెయిర్ రీమేక్ ఇది.

ఇద్దరికీ సరిసమానమైన ట్రాక్స్, డైలాగ్స్ ఉంటాయి. ఇక లుక్స్ విషయానికొస్తే రానా లుక్ పర్ఫెక్ట్ గా కుదిరింది. పంచె కట్టులో రానా అదిరిపోయేలా ఉన్నారు. ప్రస్తుతం లాడ్జ్ సెటప్లో ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆన్ లొకేషన్లో రానా లుక్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. అలాంటిది ఇక సినిమాలో రానా స్క్రీన్ ప్రెజెన్స్ తప్పకుండా గుర్తుండిపోయేలా ఉంటుంది. సాధారణంగా పవన్ ఎదుట ఏ స్టార్ అయినా తక్కువే అనిపిస్తారు. కానీ రానా లుక్ చూసాక ఆయన కూడ స్క్రీన్ మీద మెరవడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు