తెలుగు రాష్ట్రాల్లో “రంగ్ దే” రెండు రోజుల వసూళ్లు ఇవే.!

Published on Mar 28, 2021 4:00 pm IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రంగ్ దే” మొన్ననే విడుదలై మంచి టాక్ తో మొదటి రోజు వరల్డ్ వైడ్ డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.65 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ కనబరిచినట్టు పి ఆర్ టీం చెబుతున్నారు. మరి రెండు రోజులకి కలిపి ఈ చిత్రం ఏరియాల వారీగా రాబట్టిన మొత్తం వసూళ్లను చూసినట్టు అయితే..

నైజాం : రూ .2.74 కోట్లు
తూర్పు గోదావరి : రూ .69.8 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ .48 లక్షలు
కృష్ణ : రూ 36.6 లక్షలు
నెల్లూరు : రూ .33.18 లక్షలు
వైజాగ్ : రూ .94 లక్షలు
గుంటూరు : రూ .96 లక్షలు
సీడెడ్ : రూ .1.14 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2 రోజుల షేర్ – రూ .7.65 కోట్లు.

ఈ రెండు రోజులకి ఇది మంచి హోల్డ్ అని చెప్పాలి. మరి అలాగే ఈరోజు సండే కూడా కావడం ఈరోజు కూడా మంచి నంబర్స్ ఈ చిత్రానికి రావడం కన్ఫర్మ్. మరి తర్వాత నుంచి ఎలాంటి వసూళ్లను ఈ చిత్రం రాబడుతుందో చూడాలి. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :