నాకిష్టమైన పాట మీ అందరిచేత డాన్స్ చేయిస్తుంది – చరణ్

రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ప్రోమో ‘రంగ రంగ రంగస్ధలాన’ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మధ్యాహ్నం నుండి పాట కోసం ఎదురుచూస్తున్న అభిమానులు విడుదలకాగానే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇదివరకే జ్యూక్ బాక్స్ ద్వారా బయటికొచ్చి అలరించిన ఈ పాటకు ప్రోమోలో చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించాడు.

ఇది తన ఇంట్రో సాంగ్ చెప్పిన చరణ్ తన అన్ని ఇంట్రో పాటలకంటే ఇదంటేనే తనకు ఎక్కువ ఇష్టమని, ఇది మీ అందరినీ డాన్స్ చేసేలా చేస్తుందని అన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ అన్ని పాటలకు చంద్రబోస్ లిరిక్స్ రాయడం విశేషం. మార్చి 30న భారీ ఎత్తున విడుదలకానున్న ఈ చిత్రంలో సమంత చరణ్ కు జోడీగా నటించింది.

ప్రోమో కొరకు క్లిక్ చేయండి :