నైజాంలో సత్తా చాటిన రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ నిన్న విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ముందు నుండి ఉన్న అంచనాల మూలాన చిత్రానికి ఓపెనింగ్స్ కూడ భారీ స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా మెగా హీరోలకి బలమైన ఫ్యాన్స్ బేస్ ఉన్న నైజాం ఏరియాలో తొలిరోజు వసూళ్లు బాగానే ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు చిత్రం నైజాంలో ఫస్ట్ డే రూ.3.80 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. ఈరోజు, రేపు కూడ సెలవులు కావడం, పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ రన్ ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత కథానాయకిగా నటించగా ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో నటించారు.