ఈ వారంలో విడుదలకానున్న ‘రంగస్థలం’ 2వ పాట !
Published on Feb 19, 2018 1:33 pm IST

రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’ సినిమాలోని మొదటి పాటు ‘ఎంత సక్కగున్నావే’ ఇటీవలే విడుదలై భారీ స్పందనను తెచ్చుకుంది. ఈ పాటతో చిత్ర ఆడియోపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ప్రేక్షకులు, అభిమానులు మిగిలిన పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రెండవ పాటకు సంబందించిన అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.

అదేమిటంటే ఈ పాట ఈ వారంలోనే రిలీజవుతుందట. మరి మొదటి పాటలానే ఈ పాట కూడ సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా సమంత నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వీరి పాత్రల తాలూకు టీజర్స్ బాగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదలచేయనున్నారు.

 
Like us on Facebook