‘రంగస్థలం’ ట్రైలర్ విడుదలయ్యేది అప్పుడేనా ?

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ రోజు ఉదయం చిత్ర నిర్మాతలు రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను ఈ నెల 18 న వైజాగ్ లో చెయ్యబోతున్నామని అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ ప్రదాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోందని సమాచారం.

మార్చి 18న జరగబోయే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మార్చి 30 లోపు ఈ సినిమాకు సంభందించిన మరో ఫంక్షన్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. పాటలు, టీజర్ విడుదలయ్యాక అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.