అక్టోబర్ ఆఖరుకు ముగియనున్న ‘రంగస్థలం’ షూటింగ్ !

7th, August 2017 - 08:56:10 AM


మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ కూడా ఒకటి. అందులో రామ్ చరణ్ 1985 కాలంనాటి పల్లెటూరి యువకుడి గెటప్లో కనిపిస్తుండటం, దీన్ని సుకుమార్ ఒక ప్రేమ కథగా చిత్రీకరిస్తుండటంతో అందరిలోను సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొని ఉంది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఒక ప్రత్యేకమైన పల్లెటూరి సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

జగపతి బాబు, రామ్ చరణ్ లపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా పూర్తి షూటింగ్ అక్టోబర్ కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే సినిమాను ఈ ఏడాది క్రిస్టమస్ కు రిలీజ్ చేస్తారా లేకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలచేస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.