‘రంగస్థలం ,వివిఆర్’ మలయాళ వర్షన్ల రిలీజ్ డేట్స్ ఫిక్స్ !

Published on Dec 27, 2018 11:13 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఈఏడాది లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం కేరళ లో వచ్చే ఏడాది జనవరి 18న విడుదలకానుంది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మలయాళ వర్షన్ను డిస్ట్రిబ్యూషన్ చేసిన సంస్థే ఈ చిత్రాన్ని ఆక్కడ విడుదల చేస్తుంది. ఇక ఈ చిత్రం తోపాటు ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ కూడా మలయాళంలో విడుదలకానుంది. ఈ చిత్రం తెలుగులో 2019 జనవరి 11న రిలీజ్ అవుతుండగా కేరళలో జనవరి 25న విడుదలకానుంది.

ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలో రామ్ చరణ్ నటించిన రెండు చిత్రాలు మలయాళం లో విడుదలకానున్నాయి. మరి ఈ చిత్రాలు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.

ఇక వినయ విధేయ రామ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం జరుగనుంది. ఈ ఈవెంట్లో ఈచిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేయనున్నడంతో ట్రైలర్ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు.

సంబంధిత సమాచారం :