`రంగు` కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటున్న హీరో !

`రంగు` కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటున్న హీరో !

Published on Oct 21, 2018 4:00 AM IST

కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. ఈ చిత్రానికి ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా… ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌ర రావు మాట్లాడుతూ `ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా రాసుకున్న క‌థ ఇది. తీనీశ్‌, ష‌ఫీ, ర‌వి అంద‌రూ అద్భుతంగా న‌టించారు. ఈ యంగ్ టీమ్‌కు నేను, సిరివెన్నెల సీతారామశాస్త్రి మా అనుభ‌వంతో కాస్త తోడ్పాటును అందించాం. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా అని` అన్నారు.

హీరో త‌నీశ్ మాట్లాడుతూ – “నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌గా.. మా `రంగు` సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, మూడు సాంగ్స్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌కు వ‌న్ మిలియ‌న్ వ్యూస్ వ‌స్తే.. సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని త‌ర్వాత నాకు తెలిసింది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ‌లో ఉన్న లారా అనే వ్య‌క్తి పాత్ర‌లో నేను క‌న‌ప‌డ‌తాను. ప‌దిహేడేళ్ల నుండి ఇర‌వై ఎనిమిదేళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డే పాత్ర నాది. నాలుగు వేరియేష‌న్స్‌తో సాగుతుంది. నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో హీరోలు, విల‌న్స్ అంటూ ప్ర‌త్యేకంగా ఉండ‌రు. ప‌రిస్థితుల ప్ర‌భావం క‌న‌ప‌డుతుంది. ప్ర‌తి మ‌నిషిలో మంచి, చెడు ఉంటాయి. అది ఎదుటి అంశాన్ని చూసే కోణాన్ని బ‌ట్టి తెలుస్తుంది. అలాంటి ప‌రిస్థితులను ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా కోసం చాలా ఎగ్జ‌యిటెడ్‌ గా వెయిట్ చేస్తున్నాను“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కార్తికేయ.వి మాట్లాడుతూ – “న్యూస్ పేప‌ర్‌లో ఓ విష‌యాన్ని చ‌దివి ఆ ఆలోచ‌న‌తో విజ‌య‌వాడ వెళ్లాను. అక్క‌డ లారా అనే వ్య‌క్తి గురించి విష‌యాల‌ను సేక‌రించి దాన్నుండి త‌యారుచేసుకున్న క‌థ ఇది. డైరెక్ట‌ర్‌గా నాకు జ‌న్మ‌నిచ్చిన నిర్మాత‌ల‌కు రుణ‌ప‌డ్డాను“ అన్నారు.

నిర్మాత ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ రంగు సినిమా ద్వారా ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాం. స‌మాజంలో యువ‌త ఎలా బాధ్య‌త‌తో ఉండాలి. స‌మాజాన్ని కాపాడాల్సిన పోలీసుల బాధ్య‌త ఏంటి? .. ఇలా చాలా అంశాల‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాం. త‌ప్ప‌కుండా మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం“ అన్నారు.

నిర్మాత న‌ల్ల అయ్య‌న్న నాయుడు మాట్లాడుతూ – “రంగు సినిమా కోసం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ వంటి వారితో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారు కూడా ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. యూత్ ఎలాంటి దారిలో న‌డ‌వాలి అనే విష‌యంతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఉండాల‌నే విష‌యాన్ని కూడా మా `రంగు` సినిమాలో చూపిస్తున్నాం“ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు