అక్షయ్ కోసం హైదరాబాద్ వస్తున్న రణ్వీర్ సింగ్

Published on Oct 9, 2019 2:05 am IST

స్టార్ హీరో రణ్వీర్ హైదరాబాద్ వస్తున్నారు. ఒక షూటింగ్ లో భాగం నేడు హైదరాబాద్ కు బయలుదేరారు. విషయంలోకి వెళితే అక్షయ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సూర్యవంశీ. ఈ మూవీ పతాక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణలో అక్షయ్ కుమార్ తో ఆయన జాయిన్ కానున్నారు. సూర్యవంశీ చిత్రంలో రణ్వీర్ సింగ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. మరో హీరో అజయ్ దేవగణ్ కూడా ఈ మూవీలో మరో గెస్ట్ గా కనిపించడం విశేషము.

అక్షయ్ కుమార్ సరసన కత్రినా ఖైఫ్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. ఇక రణ్వీర్ సింగ్ నటిస్తున్న 83మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రణ్వీర్, దీపికా జంటగా నటిస్తున్న 83మూవీ ఇండియాకు మొదటి ప్రపంచ క్రికెట్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథగా తెరకెక్కుతుంది. విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :

X
More