కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘రావు బహదూర్’.. ఆగమనం ఎప్పుడంటే..?

కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘రావు బహదూర్’.. ఆగమనం ఎప్పుడంటే..?

Published on May 8, 2026 7:26 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా దర్శకుడు వెంకటేష్ మహా రూపొందిస్తున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను తొలుత జూన్ 5న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల కానుండటంతో, పోటీని నివారించేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, ‘రావు బహదూర్’ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వికాస్ ముప్పల, బాల పరాశర్, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్ ద్వారా సమర్పిస్తుండటం విశేషం. శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు