“మహాసముద్రం”లో రావు రమేష్ ఛాలెంజింగ్ రోల్ రివీల్.!

Published on May 25, 2021 4:00 pm IST

ఒక్క మన తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలో పలువురు నటులు ఎలాంటి పాత్రలకు అయినా సరే చాలా ఈజ్ తో చేసే వారు ఉన్నారు. మరి అలాంటి అతి తక్కువ మంది వెర్సిటైల్ నటులలో రావు రమేష్ కూడా ఒకరు. పాత్ర ఎంత బలంగా ఉంటే అంత అద్భుతమైన పెర్ఫామెన్స్ ను అందివ్వడం ఆయన సొంతం.

మరి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తాను చేస్తున్న పలు సినిమాల నుంచి రోల్స్ రివీల్ అయ్యాయి. భారీ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ 2” నుంచి రోల్ ను రివీల్ చెయ్యగా తన మరో చిత్రం “మహాసముద్రం” నుంచి ఛాలెంజింగ్ రోల్ ను మేకర్స్ రివీల్ చేశారు.

శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో “గూని రాజు” పాత్రలో రావు రమేష్ కనిపించనున్నట్టుగా పోస్టర్ ను విడుదల చేశారు. మరి తన రోల్ పేరుకి తగ్గట్టుగానే సాలిడ్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. ఓ గూని వ్యక్తిగానే పక్కా నెగిటివ్ షేడ్ లో తాను ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఈ చిత్రంలో ఆయన పెర్ఫామెన్స్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :