దర్శకుడిగా హీరో.. గ్రాండ్ గా సినిమా మొదలు !

దర్శకుడిగా హీరో.. గ్రాండ్ గా సినిమా మొదలు !

Published on Jun 29, 2026 7:52 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా ‘RAPO23’ రాబోతుంది. పైగా ఈ చిత్రంతో రామ్ పోతినేని దర్శకుడిగా కూడా పరిచయం కానున్నారు. దీనికితోడు, ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథను కూడా రాశారు. ఆ రకంగా రచయితగానూ రామ్ ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం నేడు అధికారికంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో రామ్ పోతినేనితో పాటు నిర్మాత కృష్ణ పోతినేని, సినిమాటోగ్రాఫర్ తిరు మరియు చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమవుతోంది. గతంలో రామ్‌తో కలిసి నటించిన నివేదా పేతురాజ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నట్లు టాక్. అన్నట్టు ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

కాగా రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.

తాజా వార్తలు