రూ. 35 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ !
Published on Jun 4, 2017 12:58 pm IST


అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఆరంభం నుండే పాజిటివ్ టాక్ తో మొదలైన చిత్ర రన్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడంతో సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోగలుగుతోంది.

మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 32 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తొమ్మిది రోజులు గడిచే సరికి రూ. 35 కోట్లను రాబట్టింది. ఈ మొత్తంతో చైతన్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రరాండోయ్ నిలిచింది. ఇంకా వేసవి సెలవులు ముగియకపోవడంతో ఈ సినిమా వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించారు.

 
Like us on Facebook