‘గూఢచారి’కి అరుదైన గౌరవం !

‘గూఢచారి’కి అరుదైన గౌరవం !

Published on Aug 4, 2018 12:58 PM IST

Goodachari

‘క్షణం’ తరువాత శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ నటించిన చిత్రం’ గూఢచారి’. నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రేటింగ్స్ తో విజయం దిశగా దూసుకుపోతుంది.ఇక ప్రఖ్యాత ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి) ఈచిత్రానికి ఏకంగా 9.1 రేటింగ్ ను ఇవ్వడం విశేషం. అతి కొద్దీ సినిమాలు మాత్రమే ఈ ఘనత ను సాధించాయి.

స్పై త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , సుప్రియ యార్లగడ్డ లు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అంధించిన ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అడివి శేష్ సరసన శోభిత దూళిపాళ్ల నటించారు.

తాజా వార్తలు